Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బిరబిరా కృష్ణమ్మ

పెరిగిన సందర్శకుల తాకిడి
నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం జలాశయం

శ్రీశైలం ప్రాజెక్టు : ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి అత్యధికంగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో పది గేట్లను 20 అడుగుల మేరకు విడుదల చేయడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువున గల నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల సందర్శకులు భారీగా వస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సందర్శకులు సెల్ఫీలకు ఫోజులిస్తూ ఫ్యామిలీ ఫొటోలు దిగుతూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం సందర్శకులు ఆనకట్టను చూసేందుకు తండోప తండాలుగా తరలివస్తున్నారు. డ్యామ్‌ వద్ద రహదారులు రద్దీగా మారాయి. వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఈ సీజన్‌లో గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడంతో చిన్నపిల్లలు, యువత, జంటలతో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883.90 అడుగులుగా నమోదైంది. జలాశయం సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 209.5948 టీఎంసీలుగా నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img