Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీ కుట్రలు పవన్‌ కల్యాణ్‌కు అర్థమయ్యాయి : రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజాస్వామ్యం పట్టదని, రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మద్దతు లేకపోతే జగన్‌ ఒక్క రోజు కూడా సీఎం కూర్చీలో కూర్చోలేరని చెప్పారు. ఎన్ని కేసులు ఉన్నా, అవినీతి నిరూపితమైనా జగన్‌ పై చర్యలు ఉండవని అన్నారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీలో పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని కోరారు. టీడీపీ, జనసేనలతో కలసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టిని సారించాలని అన్నారు. విశాఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోచుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. ఢల్లీిలో విజయసాయిరెడ్డికి ఉన్నంత పవర్‌ మరెవరికీ లేదని చెప్పారు. బీజేపీ కుట్రలు పవన్‌ కల్యాణ్‌ కు అర్థమయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇతర పార్టీలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. 2011లోనే సస్పెండ్‌ చేసిన రొడ్డు రోలర్‌ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్‌ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని నిప్పులు చెరిగారు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్‌ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్‌ అఫీసర్‌ బదిలీపైన ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ జాతీయ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పని చేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img