Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

బొబ్బిలిలో టిడ్కో ఛైర్మన్‌ పర్యటన

విశాలాంధ్ర – విజయనగరం : విశాలాంధ్ర`బొబ్బిలి: ఈ రోజు ఏ.పి.టిడ్కో ఛైర్మన్‌ .జమ్మాన ప్రసన్న కుమార్‌ వారి యొక్క అధికారిక పర్యటనలో భాగముగా బొబ్బిలి శాసన సభ్యులు గౌరవ.శ్రీ. శంబంగి చిన అప్పలనాయుడు గారిని వారి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం మరియు దుశ్శాలు వాతో ఘనముగా సత్కరించడం జరిగింది. అనంతరం గౌరవ శాసన సభ్యులు వారికి ప్రస్తుతం నిర్మాణం లో ఉన్నటువంటి ప్రాజెక్ట్‌ గురుంచి సవివరముగా తెలియజేయడం జరిగింది. తదుపరి బొబ్బిలి రామన్న దొరవలస దగ్గర ఉన్నటువంటి టిడ్కో హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతాలను ఇంజనీరింగ్‌ అధికారుల తో కలిసి పర్యటించడం జరిగింది మరియు పూర్తి చేయవలసి ఉన్నటువంటి సివరరెజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌.ఏ.ఎల్‌. ఎస్‌.ఆర్‌ పనులను పరిశీలించడం జరిగింది. అనంతరం బొబ్బిలిలో 1680 వై.యెస్‌.ఆర్‌ జగన్నన్న నగర్‌ జింత్రీ గృహాసముదాయాలను టిడ్కో ఇంజనీర్లుతో కలసి పరిశీలించడం జరిగింది, తదుపరి మొత్తంగృహాలను పూర్తి స్థాయి సదుపాయాలతో దశల వారీగా లబ్ధిదారులకు మార్చ్‌ -23 నాటికి లబ్దిదారులకు అందించే విధముగా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను కోరడం జరిగింది. మరియు నిర్మిస్తున్న గృహాలు రెండు లక్షల అరవై రెండు వేలు గృహాలలో 300 చదరపు అడుగుల గృహాలు 143600 వీటిని కేవలం ఒక్క రూపాయి కే ఇస్తూ అలాగే 365 చదరపు అడుగుల గృహాలు 44312మరియు 430 చదరపు అడుగుల గృహాలు 74304 గృహాలు లబ్ధిదారులు కట్టవలసిన ముందస్తు ధరావత్తు సగానికి తగ్గించుటవలన రాష్ట్ర ప్రభుత్వం నకు 4300 కోట్లు మరియు రిజిస్ట్రేషన్‌ లు అన్ని కేటగిరీ లు ఉచితంగా మరో 1000 కోట్లు అందిస్తున్న ప్రభుత్వంముఖ్యమంత్రి జగన్‌ మాత్రమే.అదే విధముగా రాష్ట్రములో ఏ.పి.టిడ్కో ద్వారా నిర్మాణం చేపట్టినటు వంటి అన్ని పురపాలక సంఘాలలో పర్యావరణం పరిరక్షించే విధముగా అవలంభించే విధముగా బయో ఫెన్సింగ్‌ ను ఏర్పాటు చేయాలని కోరడమైనది.అనంతరం నిర్మాణం లో ఉన్నటువంటి పై పట్టణాలలో గల గృహసముదాయాలను పరిశీలించిన తరువాత ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిర్మాణం మరియు పూర్తిస్థాయిలో ఇళ్లను లబ్దిదారులకు అందజేత అనేటటువంటి విషయాలపై విలువైనటువంటి సూచనలను సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది మరియు ఇండ్లతో పాటు మౌళిక సదుపాయలైన వాటర్‌ సప్లై, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, గ్రీనరీ ఎలెక్ట్రిఫికేషన్‌ మరియు మురుగు కాలువలు ఏర్పాటు చేస్తూ చక్కటి పర్యావరణములో ఇళ్ళు అందజేసే విధముగా కార్యాచరణను రూపొందించాలని అధికారులకు తెలపడమైనది.అనంతరం టిడ్కో హౌసింగ్‌ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఋణసదుపాయం కల్పించే విషయంలో మెప్మా డిపార్ట్మెంట్‌ వారు, డిస్ట్రిక్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ బ్యాంక్‌ లింకేజ్‌ మరియు టిడ్కో సి.ల్‌.టి.సి అందరూ సమనవ్యయము చేసుకొంటూ లబ్దిదారులకు ఋణమంజూరులో తమ వంతు కృషి చేయాలని కోరడమైనది. పైన తెలిపిన ఈ కార్యక్రమములో టిడ్కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీ.డి.నరసింహ మూర్తి గారు, ఎక్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీమతి.జ్యోతి గారు,డిప్యూటీ ఎక్జిక్యూటివ్‌ ఇంజినీర్‌.శ్రీ.బాలకృష్ణ గారు,మునిసిపల్‌ కమీషనర్‌ శ్రీ.శ్రీనివాసరావు, టి.పి. ఆర్‌. ఓ.శ్రీ. జగన్నాథ రావు, సి.ఎల్‌.టి.సి, మరియు కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img