Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బొబ్బిలి మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం

కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు బడులు పున:ప్రారంభించాయి. ఇదే కోవలో ఏపీ ప్రభుత్వం ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్‌ను రీ`ఓపెన్‌ చేసింది. ఇదిలా ఉంటే స్కూల్స్‌ పున: ప్రారంభంతో మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదిమంది నాల్గవ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడినట్లు ఎంఈఓ లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా, ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పదిమంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తేలడంతో విద్యాశాఖ అధికారులు మిగిలిన విద్యార్థులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈఓ వెల్లడిరచారు.
కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img