Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

బ్రహ్మౌత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన గురువారం జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు సర్వదర్శనం యాత్రికులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్‌ 1న గరుడ వాహనం, 5వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మౌత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img