Friday, April 26, 2024
Friday, April 26, 2024

భక్తుల తోపులాట – తిరుమలలో 5 రోజులు బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమలలో రేపటి నుంచి (బుధవారం) నుండి ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం. 5 రోజులు విఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేటి ఉదయం ఆలయంలో సర్వదర్శనం టోకెన్‌ కేంద్రాల వద్ద తోపులాట జరగడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. ముఖ్యంగా చిన్నారులు, వయసు పైబడిన వాళ్లు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అధిక రద్దీ నేపధ్యంలో ఈ నెల తొమ్మిదోవ తారీఖునే 12కి సంబంధించిన టోకెన్లను జారీ చేసింది. ఆపై రెండు రోజుల పాటు ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో టిక్కెట్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడిరది. మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈక్రమంలో ఈనెల 13వ తేదీకి సంబంధించిన టోకెన్ల ప్రక్రియ నేటి ఉదయం నుండి ప్రారంభించింది. దీంతో పెద్దయెత్తున భక్తులు క్యూలైన్‌ వద్దకు చేరుకోవడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img