Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భారీవర్షాలు..పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

భారీవర్షాల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడిరచిన వివరాలివి. తిరుపతి నుంచి గుంతకల్‌కు వెళ్లే రైలు (నెం.07656) ను, అలాగే తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు నడిచే రైలు (నెం.16054)ను శనివారంనాడు రద్దు చేశారు. అలాగే చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతికి నడిచే రైలు(నెంబర్‌.16203) కూడా రద్దయ్యింది. అలాగే ముంబై సీఎస్టీ నుంచి నాగర్‌కోయిల్‌కు నడిచే రైలు (నెంబర్‌.16351)ను ధర్మవారం, ఎల్లంక, చన్నసంద్ర, క్రిష్ణరాజపురం, వైట్‌ఫీల్డ్‌, జోలార్‌పేటై, కాట్పాడి మీదుగా దారిమళ్లించారు. ఈ రైలు ముంబై సీఎస్టీ నుంచి శుక్రవారం బయలుదేరింది. మదురై నుంచి ముంబై ఎల్‌టీటీకి వెళ్లే రైలు(నెం.22102)ను దిండిక్కల్‌, తిరుచ్చి, ఈరోడ్‌ మీదుగా దారిమళ్లించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img