Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భోగాపురానికి త్వరలో ఆరు లేన్ల రోడ్లు

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం : భోగా పురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, విశాఖపట్నం సీ పోర్టు నుండి భోగాపురం వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ నగరం 14వ వార్డు పరిధిలోని సీతమ్మధారలో పార్కు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణాలకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూములనే ఉపయోగించడానికి ప్రయత్నిస్తామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రైవేటు ఆస్తుల జోలికి వెళతామని విజయసాయి చెప్పారు. అందుకే రోడ్ల నిర్మాణం పనుల్లో వేగం తగ్గడం వాస్తవమేనన్నారు. సీ పోర్టు నుండి భీమిలి వరకు రోడ్డు, భవనాల శాఖ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణ పనులు చేపట్టనుందని, భీమిలి నుండి భోగాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంటుశాఖ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనుందని వివరించారు. ఆరు లేన్ల రోడ్లకు సంబంధించి సర్వేలు పూర్తయ్యా యన్నారు. నగర శివార్ల నుండి భీమిలి వరకు 70 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డు అత్యాధునిక ప్రమాణాలతో, నాణ్యతలో రాజీపడ కుండా నిర్మిస్తా మని అన్నారు. రోడ్డుకు వాకింగ్‌ ట్రాక్‌ ఓవైపు, సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణం మరోవైపు చేపట్టనున్నట్లు తెలిపారు. నగరపరిధిలో రోడ్డు వెడల్పు అక్కడి పరిస్థితుల దృష్ట్యా కొంతమేర తగ్గ వచ్చన్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాల దృష్ట్యా పురుషోత్తంపట్నం నుండి విశాఖపట్నం వరకు పైనులైన్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోడ్డు నిర్మాణం, పైపులైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగప్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపు తున్నారని, త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభ మవుతాయని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి కోర్టులో కేసులు పెండిరగులో ఉన్నా యని, త్వరలో అవి పరిష్కారం కానున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముఖ్య మంత్రి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, మేయర్‌ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, జీవీఎంసీ కమిష నర్‌ సృజన, డిప్యూటీ మేయర్‌ సతీష్‌, నెట్‌ క్యాప్‌ చైర్మన్‌ కెకె రాజు, కార్పొరేటర్లు , వైసీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img