Friday, April 19, 2024
Friday, April 19, 2024

మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ విడుదల

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వైరస్‌ కలవరం రేగింది. మంకీపాక్స్‌ కేసులు అక్కడక్కడ నమోదవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువైంది. భారతదేశంలో ఇప్పటి వరకు 10 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో … మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కిట్‌ మొట్టమొదటిసారి స్వదేశంలోనే తయారుకావడం గమనార్హం.విశాఖలోని మెడ్‌ టెక్‌ జోన్‌లో ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ సంస్థ ఆర్టీపీసీఆర్‌ విధానంలో మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ను అభివృద్ధి చేసింది. ట్రాన్సాసియా ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ శుక్రవారం మెడ్‌టెక్‌ జోన్‌లో ఆవిష్కరించారు. కిట్‌ ఆవిష్కరణ అనంతరం ట్రాన్స్‌ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్‌ వజిరాణి మాట్లాడుతూ, ఈ కిట్‌ అత్యంత సున్నితమైనదన్నారు. అయినప్పటికీ ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కిట్‌ సాయంతో ఇన్ఫెక్షన్‌ను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్‌ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్‌ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్‌ మాజీ డైరెక్టర్‌ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img