Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మత్స్యకారులు ‘ఫిష్‌ ఆంధ్రా’ సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మత్స్యకారుల జీవన ప్రమాణానలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఫిష్‌ ఆంధ్రా పథకాన్ని చేపట్టారని, చేప ఉత్పత్తులు విక్రయించే వారు శాశ్వతంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కార్పొరేషన్‌ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో మంగళవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ఫిష్‌ ఆంధ్రా పథకం ద్వారా ఆక్వా ఉత్పత్తులను వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందనన్నారు. దుకాణాలను ఏర్పాటు చేసే స్థాయిని బట్టి బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఫిష్‌ ఆంధ్రా పథకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు మత్స్యకారులకు నగర పరిధి తెనాలి రోడ్డు రక్షిత మంచినీటి పథకం వద్ద, సీతానగరం కృష్ణానది సమీపంలో కంటైనర్‌ దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దుకాణాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఫిష్‌ ఆంధ్రా పథకం ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్రపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని, మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. కావున ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిషనర్‌ శారదా దేవి, జిల్లా మత్స్యశాఖ అధికారి వివిఆర్‌ బాబు, ఫిషరీస్‌ డెవలప్మెంట్‌ అధికారి ప్రసాద్‌, గ్రామ మత్స్య శాఖ సహాయకులు అనిల్‌, పుష్పాలత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img