Friday, April 19, 2024
Friday, April 19, 2024

మద్యం దుకాణాల నిర్వాహణపై ఉన్న మక్కువ విద్యాలయాలపై లేదు

బీజేపీ నేత లంకా దినకర్‌
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయంతో ఎయిడెడ్‌ పాఠశాలల్లో పిల్లల చదువులు రోడ్డున పడ్డాయని బీజేపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు.. సీఎంకు మద్యం దుకాణాల నిర్వాహణపై ఉన్న మక్కువ విద్యాలయాల నిర్వహణపై లేదన్నారు. రాష్ట్రంలో ‘విద్య వద్దు – మద్యం ముద్దు’ అన్నట్టు జగన్‌ పాలన ఉందన్నారు. అదనపు అప్పు కోసం మద్యం రేట్లు పెంచి మద్యం వినియోగదారులతో ఆ అప్పు కట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వ్యాట్‌ తగ్గితే ఆ వస్తువు ధర తగ్గుతుంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాదని, ఇదే మోడరన్‌ ‘‘జగనామిక్స్‌’’ అని, మరి వ్యాట్‌ పెంచినప్పుడు కూడా ఇదే సూత్రం పాటించగలరా? అని ప్రశ్నించారు. క్రమంగా మద్యం రద్దు అన్న జగన్‌.. మద్యం నిర్మూలన కోసం ఒక సలహాదారుని నియమించి లక్షల్లో జీతం ఇస్తున్నారని, కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచుతున్నారని విమర్శించారు. మద్యం నిర్మూలన కోసం ఉన్న సలహాదారు మద్యం ఆదాయం పెంచడానికా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img