Friday, April 19, 2024
Friday, April 19, 2024

మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మాది : సీఎం జగన్‌

వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం జగన్‌ అన్నారు. మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని అన్నారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోని 130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు.గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేశామని అన్నారు.ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందింస్తున్నామని చెప్పారు. ఇతర రాష్టాల్లో 130 సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ. 10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 9 నెలలుగా ఆరోగ్యశ్రీపై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ చెప్పారు. వైద్యుల సూచన మేరకు అవసమైతే మరిన్ని వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించే విధంగా చూస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img