Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మ‌య‌న్మార్ వైపున‌కు మోచా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌కి త‌ప్పిన ముప్పు..

ఆంధ్రప్రదేశ్‌కు మోచా తుఫాన్‌ ముప్పు ఉండకపోవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఐఎండీ అంచనా ప్రకారం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుంది దీని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు- విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆతర్వాత ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుత సమాచారం మేరకు ఈతుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్‌ ఉందని తెలిపారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామ న్నారు. ఏది ఏమైప్పటికీ అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు- తెలిపారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img