Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మరో అల్పపీడనం..ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన

ఏపీని వర్షాలు వీడటం లేదు. దక్షిణ అండమాన్‌ తీరం సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.నేడు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చనుందని హెచ్చరించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2 నాటికి వాయుగుండం మారే అవకాశముందని తెలిపారు. అక్కడి నుంచి 24 గంటల మధ్య బంగాళాఖాతం పై తుఫాన్‌ గా మారవచ్చని వెల్లడిరచారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img