Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహారాజా ఆసుపత్రి పేరు మార్పు.. జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరిందని లోకేశ్‌ ట్వీట్‌

హెల్త్‌ యూనివర్సిటీ పేరును హెల్త్‌ యూనివర్సిటీగా మారుస్తూ జగన్‌ ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమై విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమర్థించగా.. ప్రతిపక్షాలు, నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారంలో సద్దుమణగక ముందే.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విజయనగరంలో ఘనమైన చరిత్ర కలిగిన మహారాజ జిల్లా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చింది. రాత్రికి రాత్రే పేరు మార్చటంపై జిల్లా ప్రజలు, తెదేపా నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. సీఎం జగన్‌ మహనీయులను అవమానించటమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి.. ప్రజల మనోభావాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. మహారాజా కుటుంబం తమ విలువైన భూమిని పేద ప్రజల వైద్యం కోసం ఆసుత్రికి దానం చేసిందని లోకేశ్‌ గుర్తు చేశారు. అశోక్‌ గజపతి రాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేయించి హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి చేశారన్నారు. జగన్‌ ప్రభుత్వం మాత్రం పేర్ల మార్పే లక్ష్యంగా పెట్టుకొని రాత్రికి రాత్రే ఆసుపత్రికి మహారాజా పేరును తొలగించిందన్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img