Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడిరచారు. సంక్రాంతి నాటికి సిలబస్‌ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడిరచారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. 2024`25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్‌, బుక్స్తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్‌ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img