Friday, April 19, 2024
Friday, April 19, 2024

మిగిలిన గేట్లను చెక్‌ చేస్తున్నాం..ఎలాంటి ప్రమాదం లేదు

నారాయణ రెడ్డి
నీటిని విడుదల చేసే క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబర్‌ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇరిగేషన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి స్పందించారు. రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, మెయిన్‌ గడ్డర్‌ విరిగిపోవడంతో..సపోర్ట్‌ రోప్‌ థ్రెడ్‌లు తెగిపోయి గేటు నదిలో పడిపోయిందని చెప్పారు. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్‌ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్‌ చేస్తున్నాం. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పులిచింతల ప్రాజెక్ట్‌ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.పభుత్వ విప్‌ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img