Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మిల్లర్ల ప్రమేయం లేని ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని తెచ్చాం : సీఎం జగన్‌

ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్ల అంశంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం లేని కొత్త విధానం అమలు తీరుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీస మద్దతు ధర కంటే పైసా తగ్గకుండా ఉండాలనే కొత్త విధానం తీసుకువచ్చామని వెల్లడిరచారు.ధాన్యం సేకరణలో తొలిసారి మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామని తెలిపారు. కొత్త విధానం ఎలా అమలవుతోందో అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చూడాలని నిర్దేశించారు. ధాన్యం సేకరణలో ముందుగానే గోనె సంచులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రవాణా, కూలీ ఖర్చుల రీయింబర్స్‌ లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. రైతులకు మేలు చేసేలా ఈ విధానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రవాణా, సంచుల ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులకు చెప్పాలని తెలిపారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img