Friday, April 19, 2024
Friday, April 19, 2024

మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపడం శిశు సంక్షేమమా ? : నారా లోకేశ్‌

మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపడం శిశు సంక్షేమమా ? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. చికిత్స కోసం తీసుకెళ్తున్న చిన్నారి.. మంత్రి కాన్వాయ్‌ కోసం 15 నిమిషాలు ట్రాఫిక్‌ నిలిపివేయడంతో చనిపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో మంత్రి పర్యటన సమయంలో పోలీసుల వైఖరి వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ పర్యటనలో పోలీసులు అతిగా ప్రవర్తించారని, ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యేనన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నా పోలీసులు వదల్లేదని, వారి ఆర్భాటాల కోసం శిశువులను చంపడం శిశు సంక్షేమమా ? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img