Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముగ్గురు సెబ్‌ అధికారుల సస్పెన్షన్‌

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జ్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మస్తానయ్య, సెంట్రీ కానిస్టేబుల్‌ శ్రీహరిలను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఇటీవల వ్యాపారి దుర్గారావును విచారణ నిమిత్తం జంగయ్యగూడెం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఏలూరులో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం విధితమే. బెల్లం అమ్ముతున్నాడనే కారణంతో సెబ్‌ అధికారులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు మృతికి సెబ్‌ అధికారులే కారణమంటూ కొయ్యలగూడెం పీయస్‌ వద్ద బంధువుల ఆందోళన చేశారు. అలాగే సెబ్‌ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీస్‌ ఉన్నతాధికారులు ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. విచారణాధికారిగా ఏఎస్పీ చక్రవర్తిని నియామించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img