Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మూడు రాజధానులకు మద్దతు ఇవ్వను.. కానీ..,: మంత్రి దాడిశెట్టి రాజా..

ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. విశాఖ లో పరిపాలనా రాజధాని డిమాండ్‌ చేస్తూ వైసీపీ నేతలు ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. టీడీపీని ఫిక్స్‌ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ విశాఖలో జనవాణీ కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించారు. అటు అమరావతి రైతు మహా పాదయాత్ర త్వరలో ఉత్తరాంధ్రలో ప్రవేశించనుంది. ఈ యాత్ర ను ఉత్తరాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి దాటిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాగర్జన డైవర్ట్‌ చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ ఉత్తరాంధ్ర టూర్‌ పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీకి మంత్రి సవాల్‌ చేసారు.టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని..ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనంటూ మంత్రి కీలక ప్రకటన చేసారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్‌ కళ్యాణ్‌ పైన మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్‌ కి ఎంత అహంభావం ఎందుకని ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది వారి భావన తెలియపరచుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతుందా అంటూ నిలదీసారు. ప్రజలంతా పవన్‌ చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌ ను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ కళ్యాణ్‌ కు సిగ్గులేదు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారని మండి పడ్డారు. మూడు ప్రాంతాల ప్రజలకు వీకేంద్రీకరణ కావాలి.. రాష్ట్రమంతా అభివృద్ధి కావాలని కోరుకుంటూ వైజాగ్‌లో 15వ తేదీన గర్జన నిర్వహిస్తున్నారని మంత్రి వివరించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. దానికి వైయస్‌ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని చెప్పారు. చంద్రబాబు బినామీలు 150 మంది, దత్తపుత్రుడికి అమరావతి ఇష్టమైనంత మాత్రానా.. రాష్ట్ర ప్రజలకు వారి మనసులో ఉన్న భావన తెలియజేసే హక్కు లేదా అని మంత్రి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజలను తరాలుగా బానిసలుగా చేసి అమరావతిని పెద్ద వ్యాపార సంస్థ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి.. ఈ రకమైన అహంభావమైన మాటలు మాట్లాడుతున్నారా అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img