Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మేడికొండూరులో గ్యాంగ్‌రేప్‌

కూలీలను ప్రశ్నించిన పోలీసులు
గుంటూరు జిల్లా మేడుకొండూరు వద్ద దారుణ సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి.. దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో ఈ సంఘటన జరిగింది. బైక్‌పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. సమీపంలోని కోల్డ్‌స్టోరేజీ నిర్మాణ పనులకు వచ్చిన ఒడిశా కార్మికులను పోలీసులు విచారించారు. మరో వైపు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
దోషులను తక్షణం గుర్తించి కఠినంగా శిక్షించాలి : రామకృష్ణ
వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బైక్‌పై వెళుతున్న దంపతులను దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి గ్యాంగ్‌ రేప్‌ చేయటం అమానుషమన్నారు. ఫిర్యాదు తీసుకోకుండా మేడికొండూరు పోలీసులు తమ పరిధి కాదనటం దుర్మార్గమని మండిపడ్డారు. దిశ చట్టం, జీరో ఎఫ్‌ఐఆర్‌లు కేవలం ప్రచారాలకే పరిమితమా? అని నిలదీశారు.ు. దోషులను తక్షణం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు నమోదు నిరాకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img