Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీ… జగన్‌ విధ్వంసక చర్యలపై
కళాకారులు ప్రజలను చైతన్యవంతులను చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర – తెనాలి : మోదీ, జగన్‌ విధ్వంసక చర్యలపై కళాకారులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం అధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో బుధవారం మూడవ రోజు శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్‌, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య శిక్షణా శిబిరంలో పాల్గొన్న శిక్షకులకు భవిష్యత్తులో వారు నిర్వహించాల్సిన విధులను వివరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి అవలం భిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేయాలని అన్నారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లా డుతూ కళాకారులు తమ ప్రదర్శనలను ప్రజలకు అర్ధమయ్యే శైలిలో మోదీ, జగన్‌ విధ్వంసక చర్యలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. టీవీ చానళ్లు, పత్రికల్లో వ్యతిరేకంగా వార్తలు వస్తే, ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. కళాకారులు ఈ మూడురోజుల శిక్షణా శిబిరంలో పొందిన శిక్షణతో గ్రామగ్రామాన ప్రదర్శనలిచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 14 నుంచి జరిగే సీపీఐ, సీపీఎం పాద యాత్రలో పాటల ద్వారా ప్రజలను చైతన్య పరచా లన్నారు. అరసం జిల్లా కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు శిక్షణా శిబిరం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ సంద ర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి శిక్షణా శిబిరంలో పాల్గొన్న కళాకారులను రామకృష్ణ, ముప్పాళ్ల అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img