Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రామతీర్థంలో అశోక్‌గజపతిరాజు, అధికారుల మధ్య తోపులాట

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, వెల్లంపల్లి నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే చేసేవారన్నారు. దీనికి విరుద్దంగా మంత్రులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అధికారులు, అశోక్‌గజపతిరాజు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.ంస్కృతి, సంప్రదాయాలను అధికారపార్టీ పాటించలేదని, ధర్మకర్త చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం చాలా మూర?త్వంగా వెళుతోందని, రాజ్యాంగాన్ని అతిక్రమించి, చట్టాలు, కోర్టులు చెప్పిన అంశాలను తుంగలో తొక్కిందన్నారు. ఏకపక్ష ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకొని అసంతృప్తిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img