Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రంలో మరో మూడురోజులు వానలు

అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం ఏర్పడిరది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5 .8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి , తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద రాగల 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగించి నైరుతి బంగాళాఖాతం వద్దనున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ,ఉత్తర తమిళనాడు తీరానికి సుమారు నవంబర్‌ 18, 20, 21 వ తేదీన చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాఆంధ్ర,దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img