Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మరిచిపోయారు

మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు

విశాలాంధ్ర- విజయనగరం : దివంగత నేత,టిడిపి వ్యవస్థాపకుడు, మాజి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ వర్ధంతిని విజయనగరం లో ఘనంగా నిర్వహించారు. విజయనగరం కోట వద్ద ఎన్ టి ఆర్ విగ్రహానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా.అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ యుగపురుషుడని, రాష్ట్ర అభివృద్ధి కి ఎంతగానో కృషి చేశారన్నారు. ఎన్ టి ఆర్ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయలను ఇనుమడింపజేశారని,మహిళలు కి సమాన అవకాశాలు కల్పించారన్నారు.వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మర్చిపోయారన్నారు.రాష్ట్ర భవిష్యత్ మొత్తం అంధకారం లో మునిగిపోయిందని,అభివృద్ధి నామమాత్రం కూడా లేదన్నారు.ఉద్యోగాలు కోసం ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రలుకి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు.ప్రతిపక్ష నేత పర్యటనలు అడ్డుకోవాలి అని అడ్డగోలు జి.ఓ.లు తెస్తున్నారని,వాటిని హైకోర్టు కొట్టేసిన బుద్ధి రావడం లేదన్నారు.పోలీసులు వారి విధులు సంక్రమంగా నిర్వర్తించడం లేదని,ప్రతిపక్షలు మీద కేసులు నమోదు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ప్రభుత్వ అధికారులుకి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో వుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img