Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రాన్ని జగన్‌ సర్కార్‌ అప్పుల ఊబిలోకి నెట్టేసింది : చంద్రబాబు

చరిత్రలో ఎవరూ చేయని నష్టం జగన్‌ చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఆయన మంగళగిరి నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జగన్‌ సీఎం అయ్యాక వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ సర్కార్‌ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో జగన్‌రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్‌ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు.అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను, నిన్న విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని, ఇంకొన్ని రోజులు పోతే రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు.చివరకు చెత్తపై కూడా ఏపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని విమర్శించారు. జగన్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img