Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్రంలో సంక్రాంతి తర్వాతే నైట్‌ కర్ఫ్యూ అమలు

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విధించిన రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 18వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్‌ కర్ఫ్యూని ఎత్తేసి సంక్రాంతి తర్వాతి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను సవరించి తాజాగా జీవో జారీ చేసింది.సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నైట్‌ కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, ఫార్మసీ దుకాణాలు, మీడియ సంస్థలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్‌ సేవలు, పెట్రోల్‌ బంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img