Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం : సీఎం జగన్‌

గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చింది. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ, రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది రైతులకు రూ.534.77 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతు గ్రూపులకు వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2014 నుంచి 2016 వరకు అప్పటి ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని సీఎం జగన్‌ అన్నారు. రైతులకు వందల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఎగ్గొట్టారన్నారు. 2016లో ఇవ్వాల్సిన సబ్సిడీని 2017లో ఇచ్చారని, గత ప్రభుత్వంలో ఏనాడూ సమయానికి పరిహారం ఇవ్వలేదని, కౌలు రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ క్రాప్‌ డేటా ఆర్బీకే స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img