Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు


: సీఎం జగన్‌
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు. ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు.
తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలని అన్నారు. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి.టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి.వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను పెట్టాలని, ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజాశంకర్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీ ఎస్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సఫ్లైస్‌ డైరెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, సివిల్‌ సఫ్లైస్‌ ఎండీ జీ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img