Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైలు ఢీకొని ఐదుగురు మృతి

శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరు-సిల్చార్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు నిలిచిపోయింది. జనరల్‌ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు అత్యవసర చెయిన్‌ లాగారు. రైలు ఆగడంతో ప్రయాణికులు కిందికి దిగారు. కొందరు అవతలివైపు ఉన్న పట్టాలు దాటే క్రమంలో, అదే సమయంలో దూసుకొచ్చిన కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును గమనించలేదు. దాంతో రైలు పట్టాలు దాటుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. కాగా, మరణించినవారు అసోంకు చెందినవారిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

ౖరైలు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు మరణించారని తెలియడంతో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img