Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూసర్వే జరగాలి

జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్‌ సమీక్ష
అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం

లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూసర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్చూచిగా నిలవాలని ఏపీ సీఎం జగన్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘‘జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం’’ పై నేడు ఆయన సమీక్ష చేపట్టారు. ు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్‌ ను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుకు తీసుకువచ్చారు. ఆ డ్రోన్‌ ను సీఎం జగన్‌ ఆసక్తిగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 20 డ్రోన్లను కూడా రంగంలోకి దించనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ భూ హక్కు-భూ రక్ష పథకానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img