Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నాం : మంత్రి కురసాల కన్నబాబు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగం చూపిన ప్రగతి దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి రైతు భరోసా కింద రూ.1036 కోట్లు రైతుల అకౌంటులో వేశారన్నారు. తాము లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. తొలుత 45 లక్షల రైతులకు ఇస్తే.. ప్రస్తుతం 50.58 లక్షల మందికి ఇస్తున్నామని.. ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.అటవీ, దేవాదాయ భూములు సాగుచేసే రైతులకు కూడా సాయం అందిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరన్నారు. చెప్పిన దాని కన్నా ఎక్కువగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. బోర్ల కింద వరి కంటే అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండిరచండి అని మేము సలహా మాత్రమే ఇచ్చాం. అసలు వరి పండిరచవద్దని మేము చెప్పినట్లు చంద్రబాబు వక్రీకరించారని అన్నారు. చెప్పిన దానికన్నా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం మాది అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img