Friday, April 19, 2024
Friday, April 19, 2024

లెఫ్ట్‌ నేతలపై పోలీసుల జులుం

పెట్రో ఉత్పత్తుల ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన
ఆటో పైకి ఎక్కి వినూత్న నిరసన
మధు, దోనేపూడి శంకర్‌ సహా అనేక మంది అరెస్ట్‌
పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం

విశాలాంధ్ర ` విజయవాడ(కృష్ణలంక) : పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర సర ుకుల ధరల పెరుగుదలపై వినూత్న రీతిలో నిరస న తెలియజేస్తున్న వామపక్ష నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్నవారిని బల వంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కనీసం ప్రజా సమస్యలపై నిరసన తెలియజేసే హక్కును కూడా పోలీసులు హరి స్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ(యు) పార్టీలు సోమవారం ఉదయం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. ఆటో కార్మి కులు, సరుకు రవాణా ముఠా కార్మికులు తమ వాహనాలతో ర్యాలీగా వచ్చారు. పెద్ద సంఖ్యలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, నాయకులు పాలొ ్గన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ధర్నా చౌక్‌కు నలువైపులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహన చోదకులకు అడ్డంకులు రాకుండా దారి మళ్లిం చారు. ఆటోపై కూర్చుని ధర్నా చౌక్‌కు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ సహా అనేక మందిని ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు ధర్నా చౌక్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా బలవంతంగా వ్యానులో ఎక్కించి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పి.మధు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ రూ.30 లక్షల కోట్లు అయితే రోడ్డు సెస్‌లు, ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో రూ.36 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తూ నడ్డి విరగ్గొడుతున్నారని అన్నారు. కేరళ రాష్ట్రంలో పెట్రోల్‌పై జీఎస్టీ రద్దు చేశారని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రం మోదీ విధానాలకు తలొగ్గి ధరల పెరుగుదలపై మౌనంగా ఉన్నారని విమర్శిం చారు. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.
ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధరల పెరుగుదల : శంకర్‌
మోదీ పాలనలో దేశంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని దోనేపూడి శంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటరు రూ.40లకే లభించే పెట్రోల్‌, డీజిల్‌పై అధికంగా పన్నులు వేసి రూ.107లకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ధరలను అదుపులోకి తీసుకు వస్తానని ఇచ్చిన హామీలు మర్చిపోయి నేడు కరోనా సంక్షోభంలో సైతం భారీగా పన్నులు, ధరల భారాలు మోపుతున్నారని విమర్శిం చారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంకలలో తక్కువ ధరకు పెట్రోల్‌ లభిస్తోందని, మనదేశంలో మాత్రం ఆరు నెలల్లో దాదాపుగా 60 సార్లు పెట్రోల్‌ రేటు పెంచారన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తే, నిరసన వ్యక్తం చేస్తే అక్రమ అరెస్టులు చేయడం, కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు డి.వి. రమణబాబు, తాడి పైడియ్య, కె.వి. భాస్కరరావు, కొట్టు రమణరావు, సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూరావు, డి.వి. కృష్ణ, డి.కాశీనాథ్‌, న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి కె.పోలారి, ఏఐట ీయూసీ నగర అధ్యక్షుడు మూలి సాంబశివ రావు, ప్రధాన కార్యదర్శి టి.తాతయ్య, కార్యదర్శి వియ్య పు నాగేశ్వరరావు, ఎంసీపీఐ(యు) నాయకుడు ఖాదర్‌బాషా, ఆటో వర్కర్స్‌ యూని యన్‌ నాయ కుడు గూడెల జనార్ధన్‌ తదితరులు ఉన్నారు. వీరిని మధ్యాహ్నం తర్వాత పోలీస్‌స్టేషన్‌ నుంచి పంపించారు.
ఆందోళన కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా సూర్యారావు, కార్యవర్గ సభ్యులు తూనం వీరయ్య, సంగుల పేరయ్య, నక్కా వీరభద్రరావు, అప్పర బోతు రాము, మహిళా సమాఖ్య నాయకులు ఓర్సు భారతి, చింతాడ పార్వతి, అరసం నాయ కుడు మోతుకూరి అరుణకుమార్‌, ఆర్‌.గురునాథం, సుజాత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img