Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి : సీఎం జగన్‌

వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జల విలయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర రివ్యూ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించండని సూచించారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలని.. వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలని పేర్కొన్నారు.ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలన్నారు.విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలన్నారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి.. పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వాలన్నారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వాలని.. దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయాలని ఆదేశించారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలన్నారు.బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img