Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వాళ్ల ట్రాప్‌లో పడొద్దు : చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై కచ్చితంగా చర్చలు జరుపుతామన్నారు. ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం కాదన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇది కాదని చెప్పారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపథ్యంలో అమరావతిలో శ్రీకాంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌ఆర్‌ఏ పైనా అన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతామని చెప్పారు. ఉద్యోగులు మొండి వైఖరితో వ్యవహరించవద్దని కోరారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వమిదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్‌ జగన్‌ వెనుకాడలేదని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img