Friday, April 26, 2024
Friday, April 26, 2024

విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగ సంఘాలు ధర్నా

విజయవాడ ధర్నాచౌక్‌లో నిరుద్యోగ, యువజన సంఘాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నా చౌక్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడకు చేరుకున్న యువతను అడ్డుకొని అరెస్ట్‌ చేశారు.విజయవాడకు విద్యార్థి, యువజన సంఘాల నేతలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో వారిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.అయితే, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నిరుద్యోగ, విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మొండి చెయ్యి చూపించి సీఎం మోసం చేశారని ఆరోపించారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.5 వేల నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సిందేనన్నారు. 25 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img