Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు : సీఎం జగన్‌

టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుపూజోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించిన అనంతరం జగన్‌ మాట్లాడారు. ‘స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని, తమపై రుద్దిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దృష్టి సారించి మార్పులు చేస్తోంది. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావు. వారిని ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలు కావు. ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా ఉంచేందుకు తీసుకొస్తున్న మార్పులు. మంచి చదువులకు పేదరికం అడ్డంకి కాకూడదని, విద్య అందరికి అందుబాటులో ఉండాలని చేస్తున్న మార్పులివి. గత ప్రభుత్వం మాదిరిగా టీచర్లు, ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే మార్పులు కావు.’ అని అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img