Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విశాలాంధ్ర`ఆస్పరి : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆస్పరిలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాల అభివృద్ధి – ప్రజల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే చిత్రలేఖనం మరియు వకృత్వ పోటీలలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, ఈ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వ్యక్తిత్వ పోటీలు విద్యార్థిని, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను ఈ నెల 20వ తేదీన వారోత్సవాలు ముగింపు సందర్భంగా అందజేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా, గ్రంథాలయాల్లో ఉంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యకు సంబంధించిన పుస్తకాలు ఎవరి దగ్గరైనా ఉన్న ఎడల, వాటిని గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img