Friday, April 19, 2024
Friday, April 19, 2024

విద్యార్థుల పోరాట విజయం… ఏఐఎస్‌ఎఫ్‌

విశాలాంధ్ర^ బ్రహ్మసముద్రం : లా ప్రవేశాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్సిటీ అధికారులు వెనక్కి తీసుకోవడం హర్షనీయం ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు హనుమంతు పేర్కొన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ
ఇప్పటికైనా వైస్‌ ఛాన్సలర్‌ విద్యార్థి వ్యతిరేక విధానాల తీసుకోవడం మానుకోవాలి
రాయలసీమ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత చెందిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 2022 23 నుండి లా ప్రదేశాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలికి యూనివర్సిటీ అధికారులు లేఖ రాయడం జరిగిందన్నారు దానితో యూనివర్సిటీ విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్‌ మరియు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయడంతో యూనివర్సిటీ అధికారులు వెనక్కి తగ్గి లా ప్రవేశాలను ఈ సంవత్సరం నుంచి కొనసాగిస్తామని తెలపడం జరిగిందన్నారు ఇప్పటికైనా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ ఇలాంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు తీసుకుంటే యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారన్నారు ఈ యూనివర్సిటీ కి ఎంతో చరిత్ర ఉంది ఈ యూనివర్సిటీలో చదివి ఎంతోమంది లాయర్లు జడ్జిలు అయినవారు ఉన్నారు. యూనివర్సిటీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో విద్యార్థులను మరియు విద్యార్థి సంఘాల నాయకులను బోధన బోధ నేతల సిబ్బంది లను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల యూనివర్సిటీలో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఐఎస్‌ఎఫ్‌ అగ్రభాగాన ఉండి పోరాడుతుందని తెలిపారు లా ప్రవేశాలను యధావిధిగా కొనసాగిస్తామని తెలపడం.లా ప్రవేశాలురద్దు చేస్తాం అని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్‌ స్వాగతిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ ఉపాధ్యక్షులు సిద్ధార్థ్‌, నాయకులు బాలు, నాని, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img