Friday, April 19, 2024
Friday, April 19, 2024

విద్యుత్తు ఛార్జీల పెంపుపై బాలినేని ఎమన్నారంటే…

విద్యుత్తు ఛార్జీల పెంపుపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమర్థిస్తూ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి ప్రజలపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బాలినేని గుర్తు చేశారు.’’కామన్‌ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు. ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1,235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే’’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img