Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖ‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉగాది వేడుక‌లు..

ఈ ఏడాది తెలుగు సంవత్స రం ఉగాది వేడుకలను విశాఖపట్టణంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనా రాజధానికి అదేరోజు మకాం మార్చే అవకాశాలు ఉండటంతో ఉగాది సంబరాలను అక్కడే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.. మూడు రాజధానులపై ఈనెల 28వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే సీఎం జగన్‌ ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో తాను విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నట్లు మరోసారి వెల్లడించటంతో పాటు ఉద్యోగులకు సైతం ఇప్పటికే మౌఖికంగా సంకేతాలు అందాయి. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆవరణలో లేదా బీచ్‌ కారిడార్‌లో ఉగాది వేడుకలు నిర్వహించే యోచన లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది గ్లోబల్‌ సమ్మిట్‌తో శుభారంభమైందని ప్రభుత్వం భావిస్తోంది. గత మూడే ళ్లుగా కుదిపివేసిన కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడే రాష్ట్రం తేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడు లు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ముందు కు రావటం 16.5 లక్షల కోట్ల పెట్టుబడి, 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.. గ్లోబల్‌ సమ్మిట్‌తో పాటు ఈనెల 29, 30వ తేదీల్లో జీ-20 సదస్సు విశాఖలోనే జరగనున్నందున అంతర్జాతీయంగా రాష్ట్రానికి మరోసారి గుర్తింపు రానుంది. ఇవన్నీ నూతన సంవత్సరంలో కలిసొచ్చే అంశాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img