Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఉద్యమం..కార్మికులకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం

విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటి ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర కొనసాగింది. దాదా 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ కొనసాగాలి, సొంత గనులు కేటాయింపు, నిర్వాసితులకు ఉపాధి కలిగించాలని డిమాండ్ చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ. ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని.. ఆసహాయ మంత్రి అంటూ సెటైర్లు పేల్చారు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలని.. ఇలా పూటకో మాట మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. తెలుగు ప్రజల తరఫున ఈవోఐ బిడ్డింగ్‌‌లో తాను పాల్గొంటాను అన్నారు. ఒక్కొక్కరు రూ.400 లు స్టీల్ ప్లాంట్ కోసం వెచ్చిస్తే.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవచ్చన్నారు.. అలాగే ఇది చరిత్రలోనే నిలిచిపోయే నిర్ణయం అవుతుందన్నారు. ప్రైవేటీకరణే మీ విధానమైతే.. ప్రజలెలా తిప్పికొడతారో చూపిస్తామన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌ వ్యవహారంపై రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల క్రితం కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేస్తామన్నారు. ఇంతలో కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని చెప్పింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందనడంలో నిజం లేదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సాగుతోందని.. మీడియాలో ప్రక్రియ ఆగిపోయిందన్న కథనాలు చూసి క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు.ఆ వెంటనే కార్మికులు కేంద్రంపై భగ్గుమన్నారు.. స్టీల్‌ప్లాంటు దగ్గర హైవేపై దిష్టిబొమ్మను దహనం చేశారు. తాము ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇకపై పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ నెల 25న ఉదయం స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ, డైరెక్టర్ల బంగళాలు ముట్టడిస్తామని ప్రకటించారు.మరోవైపు కేంద్రం నిర్వహించే బిడ్డింగ్ కు సంబంధించి తెలంగాణ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సింగరేణి అధికారులు రెండు రోజుల పాటూ స్టీల్ ప్లాంట్‌లో పర్యటించారు.. కీలక వివరాలను సేకరించారు. పరిశ్రమకు నిధులు సమకూరిస్తే లాభాల బాట పట్టే అవకాశం ఉందని రిపోర్టులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img