Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత నగదు విడుదల

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను సీఎం జగన్‌ జమ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన 3,38,792 మందికి రూ.508.18 కోట్ల మేర ఆర్థిక సాయం విడుదల చేసినట్టు వెల్లడిరచారు. ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.45 వేల మేర లబ్ది చేకూర్చినట్టు తెలిపారు. మొత్తమ్మీద ఈ మూడేళ్లలో కాపు నేస్తం ద్వారా రూ.1,492 కోట్లు ఇచ్చినట్టు సీఎం జగన్‌ వివరించారు. నవరత్నాల ద్వారా కూడా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నామని, రూ.16,256 కోట్ల మేర లబ్ది చేకూర్చామని పేర్కొన్నారు. నాన్‌ డీబీటీ ద్వారా కాపులకు మరో రూ.16 వేల కోట్లు ప్రయోజనం కలిగించినట్టు వెల్లడిరచారు. కాపులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img