Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైసీపీ అరాచకాలను ఇక సహించం

లోకేష్‌, అచ్చెన్న వార్నింగ్‌
రాజకీయంగా ఎదుర్కోలేకే వైసిపి రౌడీమూకల హత్యారాజకీయాలు తెగబడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయ్య హత్యకు టీడీపీి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ చంద్రయ్య హత్యపై స్పందిస్తూ వైసీపీ నాయకులపై సీరియస్‌ అయ్యారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్‌ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని లోకేష్‌ ఆరోపించారు. ‘పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్‌ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేసి శిక్షించాలి. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలి. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది’’ అని లోకేష్‌ పేర్కొన్నారు. ఇక ఈ దారుణ హత్యపై టీడీపీి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇకపై వైసీపీ హత్యా రాజకీయాలను సహించం… ఇప్పటి నుంచి మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. గత రెండున్నరేళ్లుగా ఏపీలో అనేకమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ చేతిలో హత్యకు గురయ్యారని అన్నారు. నేతలను, క్యాడర్‌ను భయభ్రాంతులను చేసేందకు ఈ హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img