Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా?

కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్‌ నాగలక్ష్మీపై విమర్శలు చేశారు. కలెక్టర్‌ ముందు పేపర్లు విసిరేశారు. బీకేర్‌ ఫుల్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్పందన ఎందుకు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌ తననే బయటికి వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధి అయిన నన్నే బయటికి వెళ్లమంటారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మాజీ ఎమ్మెల్యే అయిన తన సమస్యనే పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
రూ.70 కోట్ల భూమి కబ్జా
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో రూ.70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాచేశారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై 2021 జనవరిలో కలెక్టర్‌ కు జాయింట్‌ కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఎమ్మెల్యే భూఅక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఒక్కరోజులో సమస్యను పరిష్కరించారని, తన ఫిర్యాదుపై ఎందుకు స్పందించడంలేదన్నారు. ఈ భూ వ్యవహారంలో కలెక్టర్‌ కు ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి పోతుంటే ప్రశ్నించకూడదా? అంటూ మండిపడ్డారు.
సమస్యలపై కలెక్టర్‌ స్పందించనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భూసమస్యపై ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ను జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులపై ఒక్కరోజులో స్పందించే కలెక్టర్‌ తమ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వెళ్లండని కలెక్టర్‌ అనడంతో ప్రభాకర్‌ రెడ్డి తన చేతిలోని పేపర్లను టేబుల్‌ పై విసిరేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img