Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్‌ తిరస్కరించిన ధర్మాసనం

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. డ్రైవర్‌ హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ లో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్‌ కోసం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయనందున బెయిల్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసింది. కింది కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో అనంతబాబు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ లో అనంతబాబు రిమాండ్‌ లో ఉన్నారు. ఇటీవలే అనంతబాబు రిమాండ్‌ ను స్థానిక ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబర్‌ 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img