Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం

ఏపీ రైతు సంఘం జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో పి.రామచంద్రయ్య

విశాలాంధ్ర- పత్తికొండ : వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య అన్నారు. సోమవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకపోయిందని,దేశవ్యాప్తంగా 10 లక్షల హెక్టార్ల సాగు భూమి వ్యవసాయేతర రంగాలకు గురి కావడం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అన్న వస్త్రాలను అందించే అన్నదాత రైతన్నలు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కుట్రలు పడుతున్నారని, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయిలో విస్తృతంగా రైతుల దగ్గరకు వెళ్లి రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు రైతులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.జగన్నాథం లు మాట్లాడుతూ గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లో వేసిన పంటలు సరైన వర్షాలు కురవక, రబీ సీజన్‌ లో అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటల బీమా పథకం అమలులో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హత కలిగిన రైతులకు బీమా పరిహారం అందలేదని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు భీమా పరిహారం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైందని రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలన్నారు.జిల్లాలో 106 చెరువులకు తక్షణమే నీరు నింపాలని, హంద్రీనీవా కింద ఉన్న కుడి, ఎడమ కాలువలను పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. పాలక ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img