Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్రీశైలం ప్రాజెక్టు వరద ఉధృతి..10గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం శ్రీశ్రైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,64, 683 క్యూసెక్కులుగా, ఔట్‌ ఫ్లో 3,40 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరుతుతోంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్‌ కేంద్రం నుంచి 30,624 క్యూసెక్కుల వినియోగంతో 16.374 మెగా యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్‌ కేంద్రం నుంచి 33,715 క్యూసెక్కుల నీటి వినియోగంతో 17.059 మెగా యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, 211,4759 టీఎంసీలుగా నిల్వ ఉంది. 2007, 2009, 2021 తర్వాత ఆగస్టులో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img