Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడిరచింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం తెలిపారు. పండుగ నేపథ్యంలో గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ా రేపటి నుంచి18 జనవరి వరకూ ఏపీ నుంచి 6970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు సుమారుగా 4 వేల బస్సులుంటాయని చెప్పారు. అదనపు సర్వీసులకు సర్వీసు నంబర్లు 9వేల సిరీస్‌ ఉంటుందని.. ప్రయాణికులు గమనించాలని సూచించారు. రెగ్యులర్‌ సర్వీసుల్లో 60%, స్పెషల్‌ బస్సుల్లో 50% ఇప్పటి వరకూ రిజర్వ్‌ అయ్యాయన్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరతాయన్నారు. కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే, అక్కడ నుంచే బస్సు బయలుదేరుతుందన్నారు. డీజిల్‌ రేటు 60% పెరిగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కావున టికెట్‌ ఛార్జి 50% పెంచామన్నారు. పక్క రాష్ట్రంతో రేటు విషయంలో పోటీ, పోలిక లేదన్నారు. నువ్వా, నేనా అనుకోకుండా నువ్వు, నేను అనుకునే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img